Friday, April 26, 2024

సిట్ తో కాదు సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ – బండి డిమాండ్ ..

హైద‌రాబాద్ – టి ఎస్ పిఎ స్ సి పేపర్‌ లీకేజీ వ్యవహారం దర్యాప్తును సిట్​కు అప్పజెప్పడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిప‌డ్డారు. ఈ కేసును నీరుగార్చేందుకే సిట్​కు అప్పజెప్పారని ఫైర్ అయ్యారు.. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేస్తూ, ఇప్పటికే సిట్​కు అప్పగించిన నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ.. ఇలా సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయని గుర్తు చేశారు… ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. మరోవైపు పేపర్ లీకేజీ వ్యవహారంపై టీఎస్​పీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బండి తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లు భాజపా కార్యకర్తలకు కొత్త కాదని నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల పక్షాన పోరాడేందుకు ఎంతవరకైనా వెళ్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement