Thursday, May 2, 2024

Assembly – పార్టీ పేరు మార్చిన‌ప్పుడే పేగుబంధం తెగింది – రాజ‌గోపాల్ రెడ్డి

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా పేరు మార్చిన నాడే తెలంగాణతో ఆ పార్టీకి ఉన్న పేగుబంధం తెగిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే ఎక్కువ దోపిడి జరిగిందని ధ్వజమెత్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా చూపించారని తెలిపారు. అధికార దాహంతో, అవినీతికి పాల్పడి పక్క రాష్ట్రంలోని సీఎం జగన్‌తో కుమ్మక్కై.. బీఆర్ఎస్ పేరు పెట్టి ప్రధాని పీఠానికే టెండర్ పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇక కాంగ్రెస్ పార్టీదే అధికారమని పేర్కొన్నారు.
ఏనాడైతే టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన నాడే తెలంగాణతో వారి పేగు బంధం తెగిపోయిందంటూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నోటికొచ్చినట్లుగా బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా.. ఇంకా మీకు బుద్ధి రాలేదా అంటూ తీవ్ర స్వరంతో అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement