Sunday, April 28, 2024

Hydrabad: సీఎం ప‌ద‌వి ఆశించా…అంద‌రికీ ఆ ప‌ద‌వి ద‌క్క‌డం అసాధ్యం…భ‌ట్టి

హైద‌రాబాద్ః ముఖ్యమంత్రి పదవిని ఆశించిన విషయం నిజమేనని భట్టి విక్రమార్క చెప్పారు. అయితే, అందరికీ పదవులు దక్కడం అసాధ్యమని ఆయన చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిందని గుర్తుచేశారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ విషయంపై పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని వివరించారు.

వైయస్సార్‌కు నివాళులర్పించిన భట్టి..
డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మల్లు భట్టి విక్రమార్క.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. తన నివాసంలోని పూజ గదిలో ఉన్న వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. వైయస్సార్‌పై తనకున్న అభిమానాన్ని భట్టి చాటుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement