Friday, May 3, 2024

Floods: వరదలో కొట్టుకుపోయిన ఇద్దరి మృతదేహాల వెలికితీత

మైచాంగ్ తుఫాను కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసాయి. దీంతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కరెంట్ లేక, తాగు నీరు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాగా ఈ తుఫాను కారణంగా పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా పలు చోట్ల ప్రజలు పర్ ప్రాణాలను కోల్పోయారు. ఈ వరద తాకిడి ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు కూడా తాకింది. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలను కోల్పోయారు.

వివరాల్లోకి వెళ్తే. అల్లూరి సీతారామరాజు జిల్లా లోని.. అనంతగిరి మండలంలోని.. లవ్వ గడ్డలో తుఫాను కారణంగా వరద విలయ తాండవం చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు గిరిజనులు సమీపంలోని గోస్తిని నదిలో కొట్టుకుపోయారు. కాగా స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం నదిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మృత దేహాలను నదిలో నుండి వెలికి తీశారు. కాగా ఆ మృతదేహాలు గెమ్మెలి లక్ష్మి, ఆటో డ్రైవర్ కుమార్ గా గుర్తించారు. కాగా కొట్టుకుపోయిన వారిలో మరో మహిళ మిరియాల కమల కూడా ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement