Saturday, April 13, 2024

TS : గుండెపోటుతో ఎఎస్ఐ రాజేందర్ మృతి

జ‌గిత్యాల జిల్లా కోరుట్ల ఎఎస్ఐగా ప‌నిచేస్తున్న రాజేంద‌ర్ గుండెపోటుతో శ‌నివారం తెల్ల‌వారుజామున మృతి చెందాడు. శుక్రవారం విధులు పూర్తిచేసుకుని ఇంటికి చేరుకున్న రాజేందర్‌కు రాత్రి 11 గంటల సమయంలో గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. శనివారం వేకువజామున 5 గంటలకు మళ్ళీ రాజేందర్ గుండెపోటుకు గురై మరణించినట్లు తెలిసింది. రాజేందర్ కానిస్టేబుల్‌గా పోలీస్ ఉద్యోగం ప్రారంభించి హెడ్ కానిస్టేబుల్‌గా, ఎఎస్సైగా పదోన్నతులు పొందారు. గత రెండు సంవత్సరాల క్రితం ఏఎస్సైగా పదోన్నతి పొంది కోరుట్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. రాజేందర్ మృతితో ఎస్సై కిరణ్ కుమార్, స్థానిక పోలీస్ సిబ్బంది నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement