Monday, April 29, 2024

National : బాంబు బ్యాగ్‌తో అనుమానితుడు.. సీసీటీవీ వీడియో రిలీజ్‌

బెంగుళూరు బాంబుపేలుడు ఘ‌ట‌న‌లో ఓ అనుమానితుడి జాడ‌ దొరికింది. రామేశ్వరం కేఫ్‌లోకి బ్యాగ్‌తో వెళ్తున్న ఓ అనుమానాస్పద వ్యక్తికి చెందిన సీసీటీవీ ఫూటేజ్‌ను రిలీజ్ చేశారు.

- Advertisement -

బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్ ఏరియాలో ఉన్న కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం బ్లాస్ట్ జరిగిన విషయం తెలిసిందే. పేలుడు జరగడానికి ముందు ఆ అనుమానాస్పద వ్యక్తి కేఫ్‌లో బ్యాగ్ పెట్టి వెళ్లినట్లు గుర్తించారు. అనుమానితుడితో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. బెంగుళూరు పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ప్రధాన అనుమానితుడి ఫేస్ మాత్రం మాస్క్‌తో కప్పి ఉన్నది. అతని క్యాప్ ధరించాడు. ప్లేట్‌లో ఇడ్లీ తీసుకెళ్తున్నట్లు కూడా కేఫ్‌లో ఉన్న కెమెరాలకు చిక్కాడతను. కేఫ్‌లో జరిగిన పేలుడులో పది మంది గాయపడ్డారు. యూఏపీఏ చట్టం కింద కేసు బుక్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement