Friday, May 3, 2024

Arrest – బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్

బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన డాడీ కేసులో అతడిని అరెస్ట్ చేశారవివరాలలోకి వెళితే , 17వ తేదీ ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలే జరిగింది. ఈ ఫినాలే లో పల్లవి ప్రశాంత్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు కప్ తీసుకున్న తర్వాత పోలీసుల సూచనల మేరకు చాలాసేపు బిగ్ బాస్ యాజమాన్యం ఆయనను అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉంచింది. ఆ తర్వాత ఆయనను వెనుక గేటుగుండా బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే అలా వెనుక గేటు నుంచి బయటకు వెళ్లిన పల్లవి ప్రశాంత్ తాను గెలిచి ఇలా వెళ్లిపోవడం కరెక్ట్ కాదని భావించి మరోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తన కారులో వచ్చాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఆయన కోసం ఎదురుచూస్తున్న అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీగా ఆయన వెంట వెళ్లే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో పోలీసులు పల్లవి ప్రశాంత్ కారు అడ్డుకొని మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అని హెచ్చరించాక కూడా పల్లవి ప్రశాంత్ తాను ఒక రైతు బిడ్డను, ఇలా ఒక కప్పు గెలిచిన తర్వాత తన ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

అయితే నిజానికి అంతకుముందే పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెబుతున్న కొంతమంది అమర్ దీప్, గీతూ రాయల్, అశ్విని శ్రీ వంటి వారి కార్లను డామేజ్ చేశారు. అయితే పోలీసులు చెబుతున్నా వినకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడంతో అతని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఏ -ఫోర్, ఏ -ఫైవ్ గా ఉన్న పల్లవి ప్రశాంత్ కారు డ్రైవర్లను నిన్న తరలించగా ఈ రోజు గజ్వేల్ లోని కొల్గూరులోని తన నివాసంలో ఉన్న పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసారు జూబ్లీహిల్స్ పోలీసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement