Tuesday, June 18, 2024

Armoor – ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై జీవన్ రెడ్డి ఆరోపణలు అవాస్తవం

నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఒక ప్రైవేటు చానల్లో చేసిన ఆరోపణలపై సోమవారం అంకాపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు మీడియా సమావేశం ఏర్పాటుచేసి అంకాపూర్ కు చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పై జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలు అన్ని ఆవాస్తవమని వెల్లడించారు. ఆర్మూర్ నియోజకవర్గం ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో జీవన్ రెడ్డిని చిత్తుగా ఓడించిన జీవన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని, ఇంకోసారి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై లేనిపోని ఆరోపణలు చేస్తే ఖబర్దార్ అని అంకాపూర్ గ్రామస్తులు హెచ్చరించారు.

మాజీ ఎమ్మెల్యేగా అభివృద్ధి పై గానీ అవినీతిపై గాని మాట్లాడాలి గాని కుటుంబ విషయాలలో లేనివి ఉన్నట్లుగా ఆవాస్తవ ఆరోపణలు చేస్తే జీవన్ రెడ్డిని అంకాపూర్ లో కాలు పెట్టకుండా చేస్తామన్నారు , రాకేష్ రెడ్డిని అంకాపూర్ గ్రామంలో చెట్టుకు కట్టేసి కొట్టడం పూర్తిగా అవాస్తవమని అన్నారు

ఈ మాట అన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని అంకాపూర్ గ్రామంలో చెట్టు కట్టేసి చెప్పులదండ వేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.

ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేకనే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మతిభ్రమించి వ్యక్తిగత ఆరోపణలకు దిగి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నార ని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గురించి అసత్య ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని, అంకాపూర్ లోని జీవన్ రెడ్డి ఇంటిని ముట్టడించి తగిన శాస్తి చేస్తామని అంకాపూర్ గ్రామస్తులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement