Monday, April 29, 2024

Breaking: తెలంగాణ‌లో మ‌రో జాబ్ నోటిఫికేష‌న్‌.. మ‌హిళా, శిశు సంక్షేమాధికారి పోస్టుల భ‌ర్తీ!

టీఎస్పీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మహిళా, శిశు సంక్షేమాధికారి పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. సెప్టెంబర్ 13 నుంచి దీనికి దరఖాస్తు చేసుకోవ‌చ్చు. మొత్తం 23 పోస్టులను భర్తీ చేయ‌నున్నారు. అక్టోబర్ 10వ తేదీన‌ దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. తెలంగాణలో ఇప్పటికే పలు పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వ‌చ్చాయి.

తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం 23 మహిళా, శిశు సంక్షేమాధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మల్టీజోన్ల వారీగా ఈ పోస్టులను భర్తీ చేయ‌నున్నారు. మల్టీ జోన్ 1లో 17 పోస్టులున్నాయి. మల్టీ జోన్ 2 లో 6 పోస్టులుగా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 51,320 నుంచి రూ. 1,27,310 వరకు జీతం ఉంటుంది.

ఇక‌.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. హోం సైన్స్ లేదా సోషల్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు అయి ఉండాలి. బోటనీ, బయాలజీ, బయో కెమిస్ట్రీతో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారుపోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement