Friday, May 17, 2024

ఆంధ్రప్రభ ఎఫెక్ట్: షాపింగ్ మాల్ పై కేసు నమోదు

కొత్తగూడెంలోని Gv షాపింగ్ మాల్ పై జిల్లా తునికల, కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ షాపింగ్ మాల్ లో జరుగుతున్న అక్రమాల పై ఆంధ్రప్రభ దినపత్రికలో గత వారం రోజులుగా వరుస కథనాలు ప్రచురించిన విషయం విదితమే. ఈ కథనాలపై స్పందించిన అధికారులు.. సోమవారం షాపింగ్ మాల్ లో తనిఖీలు చేశారు. షాపింగ్ మాల్ లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దుస్తులపై స్టికర్ బిల్లులు అంటించడం, తయారు తేదీ వివరాలు, టోల్ ఫ్రీ నెంబర్ లేకుండా విక్రస్తునట్లు తనిఖీలలో గుర్తించారు. దీంతో షాపింగ్ మాల్ పై కేసులు నమోదు చేసి రెండు బండిల్స్ వస్త్రాలను సిజ్ చేశారు. ఈ తనిఖీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తునికల, కొలతల జిల్లా అధికారి మనోహర్ ఆధ్వర్యంలో ఆ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement