Saturday, July 27, 2024

Amit Shah: ఇవాళ నాలుగు చోట్ల అమిత్‌షా ఎన్నిక‌ల ప్ర‌చారం

బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా ఇవాళ తెలంగాణలో నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మక్తల్‌, ములుగు, భువనగిరి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలోని ప్ర‌సంగించ‌నున్నారు.

ఉదయం మక్తల్ నియోజకవర్గంలో సకల జనుల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం ములుగు నియోజకవర్గంలో, భువనగిరి సభకు హాజరవుతారు. సాయంత్రం 6 గంటలకు కూకట్‌పల్లిలో నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement