Sunday, April 28, 2024

NZB: సరిహద్దు వాగు సమస్యపై కలెక్టరేట్ ఎదుట ఆందోళన… స్వల్ప ఉద్రిక్తత

నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 19 (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూరు మండలంలోని జాన్కంపేట్-పచ్చల నడకుడ గ్రామాల మధ్య నెలకొన్న సరిహద్దు వాగు సమస్య పరిష్కరించి రెండు గ్రామాలు శాంతి నెలకొల్పాల‌ని జాన్కంపేట గ్రామస్తులు కోరారు. ఇవాళ‌ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి జాన్కంపేట్ గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఆర్డీవో వెంటనే వెంటనే రావాలంటే నినాదాలు చేశారు. గ్రామంలో ప్రజా ప్రతినిధి, ఆర్డీఓ వారికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. సరిహద్దు వాగు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అధిక సంఖ్యలో తరలివచ్చారు. సమస్య పరిష్కరిస్తామని సముదాయించడంతో జాన్కంపేట్ గ్రామస్తులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జానకంపేట గ్రామస్తులు మాట్లాడుతూ… సమస్యపై సరిహద్దు వాగు సమస్యపై గత కొన్నిరోజుల క్రితం కలెక్టర్ కు విన్నవించినా… సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరు గ్రామాల మధ్య పెండింగ్ లో ఉన్న సరిహద్దు వాగు సమస్యపై జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టిసారించి ప్రత్యేక చర్యలు తీసుకొని సరిహద్దు వాగు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జానకంపేట గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement