Sunday, April 28, 2024

TS | అనుమతులు లేకుండా అడ్మిషన్లు… కళాశాలకు తాళం

నిజామాబాద్, (ప్రభా న్యూస్) : ఎలాంటి అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న అల్ ఫోర్స్ కళాశాలను విద్యా శాఖ అధికారి రవికుమార్ శనివారం తాళం వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆల్ ఫోర్స్ కళాశాల పేరుతో ప్రచారాల ఫ్లెక్సీలు తొలగించారు. అనంతరం కళాశాల అడ్మిషన్ తీసుకుంటున్న బాధ్యులతో డిఐఈఓ మాట్లాడుతూ…. అనుమతి లేకుండా అడ్మిషన్లు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

గత ఆరు నెలలుగా ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాల నేతల ఆందోళనలు, మీడియాలో ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఈ చర్య తీసుకుంది. నగరంలోని నాలుగు ప్రాంతాల్లో బ్రాంచీలను ఏర్పాటు చేసిన ఆల్ ఫోర్స్ కాలేజీ… తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ ప్రాంతంలో సొంత భవనాన్ని కూడా నిర్మించుకుని ఎలాంటి బోర్డు, అనుమతులు లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తోంది.

విశ్వశాంతి కళాశాల అనుమతులు రద్దు చేయాలి…

నిజామాబాద్ నగరంలోని విశ్వశాంతి కాలేజీ సెంటర్ లో… ఆల్ ఫోర్స్ కాలేజీ అంటూ ప్రచారాలు నిర్వహించి ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేస్తున్నారు. విశ్వశాంతి కళాశాలపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సంఘం జిల్లా కమిటీ కార్యదర్శి జ్వాల ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విభాగం అధికారికి వినతిపత్రం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement