Monday, October 7, 2024

ADB: జైనూర్ లో భ‌ర్త కోసం భార్య ప్ర‌చారం..

జైనూర్, నవంబర్ 16 (ప్రభ న్యూస్) : ఆసిఫాబాద్ నియోజక‌వర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్ ను గెలిపించాల‌ని కోరుతూ ఇవాళ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయ‌క్ జైనూర్ వారపు సంతలో పార్టీ నాయకులతో క‌లిసి ప్రచారం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యామ్ నాయక్ సతీమణి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కేంద్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల‌ పథకాల పత్రాలను చూపిస్తూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ముఖిద్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement