Friday, May 24, 2024

Asifabad: ట్రాక్టర్ బోల్తా.. అన్నదమ్ముల మృతి

జూలై 3, (ప్రభన్యూస్) : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని వైగాం గ్రామంలో ట్రాక్టర్ బోల్తాపడడంతో.. విద్యుత్ స్తంభాలు మీద పడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు ట్రాక్టర్ లో విద్యుత్ స్తంభాలు తీసుకొని వస్తున్న క్రమంలో బెజ్జూరు మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది.

దీంతో అందులో ఉన్న విద్యుత్ స్థంబాలు మీద పడి బుర్రి అనిల్ (24), బుర్రి వసంత్ (26) అనే యువ కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ముంజంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందడం పట్ల విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement