Sunday, May 19, 2024

బోథ్ లో జొన్న రైతులు ధర్నా..

బోథ్, జూన్ 11 (ప్రభ న్యూస్) : బోథ్ మండల కేంద్రంలో కోరమండల్ దగ్గర నిర్మల్ రహదారిపై జొన్న రైతులు ధర్నాకు దిగారు. బోథ్ మార్కెట్ కమిటీలో అధికారులు నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జొన్న కొనుగోల్లు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారని ఒక్కొక్క రైతు తమ జొన్న పంటను కాటా చేయడానికి, లారీలో లోడింగ్ చేయడానికి 15, 20 రోజులపాటు మార్కెట్ యార్డులో పడిగాపులు పడాల్సి వస్తుందన్నారు. కేవలం ఒక్క లారీ ఏర్పాటు చేసి లోడింగ్ చేస్తున్నారని , వేల కుంటల జొన్న బ్యాగులను ఒక్క లారీతో ఎన్ని రోజులు లోడింగ్ చేస్తారని మార్కెట్ అధికారుల తీరును విమర్శిస్తూ ధర్నాకు దిగారు. కనీసం ఐదు ఆరు లారీలను ఏర్పాటు చేసి జొన్న పంట బ్యాగులను లోడింగ్ చేసి రవాణా చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డులో పడిగాపులు పడుతున్న రైతులను పట్టించుకునే నాధుడే లేడని తీవ్రంగా విమర్శించారు.

కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కు లేదని పేరుకు మాత్రం పెద్ద మార్కెట్ యార్డ్ అని విమర్శించారు. రైతుల సమస్యలు పట్టించుకోని నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. సుమారు గంటపాటు ధర్నా చేసిన రైతులను స్థానిక ఏఎస్ఐ వచ్చి సముదాయించారు మార్కెట్ అధికారులతో మాట్లాడి ఎక్కువ లారీలు పెట్టే విధంగా చూస్తానని చెప్పడంతో రైతులు శాంతించారు. అసలే ఇది దుక్కుల కాలమని అటు వ్యవసాయ పనులు చూసుకోవాల్నా ఇటు మార్కెట్ యార్డులో పాడిగాపులు పడాల్నా అని రైతన్నలు విలువలడుతున్నారు. ఏది ఏమైనా రైతులను పట్టించుకోకపోతే తగిన ప్రతిఫలం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement