Saturday, June 29, 2024

ADB: అద్వాన్న రోడ్డుతో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..

ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
భీంపూర్ : గతుకుల రోడ్డుపై ప్రయాణం సాగిస్తుండగా ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్క గోతిలో కూరుకుపోయిన ఘటన సోమవారం అదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులకు పెనుగండం తప్పింది. అదిలాబాద్ నుండి కారంజి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఇందుర్ పల్లి సమీపాన అదుపుతప్పి రోడ్డు పక్క గోతిలో కూరుకుపోయింది. కంకర తేలి.. అధ్వాన్నంగా రోడ్డు ఉండగా ఇందూరు పల్లి వద్ద ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆవులను తప్పించబోయి డ్రైవర్ ఒక్కసారి బ్రేక్ వేయడంతో బస్సు రోడ్డుపక్క గోతిలోకి కోరుకుపోయింది.

బస్సు పల్టీ కొట్టి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ చాకచక్యంగా వివరించడం కారణంగా పెనుగండం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో మొత్తం ప్రయాణికులు 35మంది ఉండగా, ఎలాంటి ప్రమాదం జరగలేదు. కంకర రాళ్లు తేలి గుంతలమయంగా మారిన ఈ రోడ్డుకు మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement