Monday, April 29, 2024

TS : అంబేద్క‌ర్ ఆశయాల సాధనలో కలిసి నడుద్దాం.. కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ప్రభ న్యూస్ః భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలను ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

- Advertisement -

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, జాతి నిర్మాణం కోసం అంబేద్కర్ చేసిన సేవలు హాజరామరంగా నిలిచి ఉంటాయని అన్నారు. రిజర్వేషన్లు, భారత రాజ్యాంగం పునాదులపైనే ప్రజాస్వామ్య దేశంగా మనం నిలబడడం జరిగిందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం సూత్రంతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు గో డం నగేష్ , సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement