Saturday, June 22, 2024

అత‌ని నిర్ణ‌యం స్ఫూర్తిదాయ‌కం.. అవయవ దానం చేసిన ఆర్మీ జవాన్!

తాను బ‌తికినన్ని రోజులు దేశ సేవ కోసం జీవితాన్ని అంకితం చేశాడు. తాను చనిపోయాక కూడా పదిమందికి ఉపయోగపడేలా తన దేహాన్ని దానం చేశాడు. కాగజ్‌న‌గర్ మండలం నజురుల్ నగర్ విలేజ్ నెంబర్ 12 కు చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ సురేష్ మండల్ జులై 31న ప్రమాదవశాత్తు పశువును ఢీకొట్టిన ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్సకు హైదరాబాదు తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సురేష్ మండల్ కు హఠాత్తుగా బ్రెయిన్‌ డెడ్‌ అయిందని వైద్యులు నిర్దారించారు.

దీంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. సురేష్ నుంచి సేకరించిన అవయవాలను వైద్యులు మరో ఎనిమిది మందికి అమర్చి ప్రాణాలు కాపాడారు. చనిపోయి కూడా మరో 8 మంది ప్రాణాలను కాపాడటం తమకు ఆనందాన్ని కలిగిస్తుందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతునికి భార్య తపాసి మండల్, కుమార్తె అనుష్క ఉన్నారు. ఆదివారం వారి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కే. శివకుమార్, జనరల్ సెక్రెటరీ సునీల్ మండల్, వైస్ ప్రెసిడెంట్ పి మండల్, స్టేట్ కోఆర్డినేటర్ అబ్దుల్ నయిమ్, గ్రామస్తులు, యవకులు పెద్దెత్తున అంత్యక్రియలలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement