Saturday, June 22, 2024

తొమ్మిదేళ్ల‌లో ఘనమైన అభివృద్ధి : ఎమ్మెల్యే బాపు రావు

భీంపూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత గడిచిన తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ ఘనమైన అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవం కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆడ్డీ బోజా రెడ్డితో పాటు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గడిచిన తొమ్మిది సంవత్సరాలలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి పథకంలో దూసుకుపోయిందని, ఇదంతా కేవలం సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని అన్నారు. మండల విభజనలో భాగంగా నూతనంగా భీంపూర్ మండలం ఏర్పడిందని మారుమూల గ్రామంగా ఉన్న గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసి అభివృద్ధి దిశగా ముందుకు సాగించడం జరుగుతుందన్నారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగయ్య, స్థానిక జడ్పీటీసీ, కుంమ్ర సుధాకర్, సర్పంచ్ ల సంగం అధ్యక్షుడు మడవి లింబాజి, రైతు సమితి మండల అధ్యక్షుడు మర్సెట్టి అనిల్, ఎంపిడిఓ శ్రీనివాస్, తహశీల్దార్ మహెద్రణత్, నాయకులు సంతోష్ ఉత్తంతో పాటు పలువురు అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement