Monday, February 19, 2024

ఆర్జీయూకేటీలో ఘనంగా బోనాల పండుగ…

అర్జీయూకేటీ బాసర రెండవ ద్వారం ఆవరణలో గల పోచమ్మ తల్లి దేవాలయాన్ని ఆర్జీయూకేటీ ఉద్యోగులు సందర్శించి, బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ హాజరై పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రాంతంలో దేవతలకు నైవేద్యం సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ విషయం. ఆషాడ మాసంలో ఈ ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పంటలు పండించేందుకు, పశు పక్ష్యాదులకు ఎటువంటి రోగాలు రాకుండా ఆ తల్లి చల్లని చూపు ఉండాలని కోరుకుంటామన్నారు.

అంతేగాకుండా ఆర్జీయూకేటీ విద్యార్థులు, ఉద్యోగులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అమ్మవారి దేవాలయం చుట్టూ మహిళా ఉద్యోగులు పాటలు పాడుతూ నైవేద్యం, బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బోనాల పండుగ కమిటీ సభ్యులు డాక్టర్ గోపాలకృష్ణ, శ్రీమతి నాగలక్ష్మి, సైదులు, ఉదయ్ కుమార్, రామారావు శీలం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement