Wednesday, May 29, 2024

ADB : అంబేద్కర్ వల్లే పేద వర్గాలకు సంక్షేమ ఫలాలుః ఎమ్మెల్యే ప‌వార్

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వల్లే పేద వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం బైంసాలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళ్ల‌ర్పించారు.

- Advertisement -

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంతవరకురాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు ఉంటుందన్నారు. పేద కుటుంబంలో పుట్టి స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారతదేశంలోనే ఉన్నత విద్యావంతుడైన ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అనవసరపు ప్రచారాలు చేస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగ మార్పు ఉండబోదన్నారు. ఆయన రచించిన రాజ్యాంగమూలంగా ప్రపంచంలోనే గౌరవప్రదమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశానికి గౌరవం దక్కిందన్నారు. ఓటు హక్కుతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏర్పడడం రాజ్యాంగం వల్లేనన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం లో, సత్య సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రసాద వితరణ లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహ అభివృద్ధి కమిటీ కమిటీ సాయిలు మైసేకర్, భీమ్రావు డోంగ్రే, శంకర్ చంద్రే, గౌతమ్ పింగ్లె, గంగాధర్, ప్రసంజిత్, బిజెపి నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, నాయకులురమేష్, భీమ్రావు సోలంకి, బాలాజీ పటేల్, వడ్నప్ శ్రీనివాస్, తూముల దత్తాత్రి, తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement