Thursday, June 13, 2024

ADB: ప్రజా పాలన గ్రామసభను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

జైనూర్, డిసెంబర్ 28 (ప్రభ న్యూస్): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల్ కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీలో గురువారం ప్రారంభమైన ప్రజాపాలన గ్రామసభను ఆసిఫాబాద్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు.

ప్రజాపాలన గ్రామ సభలోప్రజలు ఇచ్చిన దరఖాస్తులను పంచాయతీ ఉద్యోగులు నమోదు చేయగా దరఖాస్తు నమోదు రిజిస్టర్​ను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. ప్రతిరోజు జరిగే ప్రత్యేక గ్రామసభలో ప్రజలనుండి దరఖాస్తులను తీసుకోవాలని వారికి ఏమైనా సమస్యలు ఉంటే తెలుపాలని ఆయన కోరారు. మొదటి రోజు గ్రామ సభకు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి రావడంతో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మెస్రం పార్వతీ లక్ష్మణ్, ఈవో శ్రీనివాసరెడ్డి సిబ్బంది పుష్పమాలతో అడిషనల్ కలెక్టర్ కు సన్మానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement