Monday, April 29, 2024

Gadwal | స్కూలు నుంచి ఇంటికొస్తుంటే.. బాలిక‌పై వీధికుక్క దాడి!

జోగులాంబ గద్వాల (ప్రతినిధి) : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోరం జరిగింది. గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలికపై వీధి కుక్క దాడి చేసింది. పాఠశాల వదలిన తర్వాత ఇంటికి వెళ్తున్న క్రమంలో వీధికుక్క దాడిలో తీవ్రగాయాలయ్యాయి. సకాలంలో గ్రామస్తులు స్పదించచడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడ్డ బాలికను కుటుంబ సభ్యులు గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉడటం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని బాలిక తల్లిదండ్రులు అంటుననారు. గ్రామ సర్పంచుతో పాటు జిల్లా యంత్రాంగం స్పందించి వీధి కుక్కల బెడద లేకుండా చూడాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement