Friday, May 3, 2024

Breaking: బైకును ఢీకొట్టిన కారు, ఒక‌రు మృతి.. వ‌రంగ‌ల్ జిల్లాలో ఘ‌ట‌న‌

మరిపెడ, (ప్రభ న్యూస్): అతివేగం.. నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ధర్మారం శివారు జాతీయ రహదారి 365పై మంగళవారం రాత్రి జరిగింది. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం హైదర్సయిపేట పంచాయతీ రావి చెట్టు తండాకు చెందిన ఇస్లావత్ హచ్చనామ(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఆయన మరిపెడ మండలంలోని గుర్రప్ప తండాలోని బంధువుల ఇంటికి మోటర్​ సైకిల్​పై బయల్దేరాడు.

ఈ క్రమంలో సరిగ్గా ధర్మారం స్టేజీ సమీపంలో మహబూబాబాద్ నుంచి మరిపెడ వైపు వెళ్తున్న కారు అతివేగంగా రాంగ్ రూట్లో వచ్చి హచ్చ భైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హచ్చ అక్కడికక్కడే చ‌నిపోయాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement