Wednesday, May 15, 2024

విరిగిపడిన భారీ వృక్షం.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

గణపురం, (ప్రభ న్యూస్): భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో ప్ర‌మాదం జ‌రిగింది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ధర్మారావుపేట మూలమలుపు వద్ద ఉన్న పెద్ద వేపచెట్టు ఉన్న‌ట్టుండి విరిగిపడింది. దీంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. చెట్టు కింద ఆటో ఉండటంతో దానిపై పడింది.

చెట్టు కొమ్మ విరిగపడుతున్న సమయంలో అదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి నష్టం జరుగలేదు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ అభినవ్ సంఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొల‌గించే ప‌నులు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement