Tuesday, February 27, 2024

టాటా ఏస్ ను ఢీకొట్టిన లారీ.. ఆరుగురికి తీవ్ర గాయాలు

కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలంలోని చెంజర్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్‌ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా ఏస్‌లోని ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా భూపాలపల్లికి చెందినవారిగా గుర్తించారు. వేములవాడ, కొండగట్టు దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement