Monday, May 20, 2024

మద్యం దుకాణాలకు 454 దరఖాస్తులు..

కామారెడ్డి, (ప్రభ న్యూస్) : జిల్లాలోని 49 మొత్తం షాపులకు బుధవారం నాటికి మొత్తం 454 దరఖాస్తులు వచ్చాయని కామారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ తెలిపారు. నిన్న 212 వైన్‌ షాపులు దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎస్టీలకు కేటాయించిన రెండు షాపుల్లో గాని తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి. ఎస్సీ లకు కేటాయించిన ఐదు షాపులకు గాను బుధవారం నాటికి 48 దరఖాస్తులు వచ్చాయన్నారు. గౌడ లకు రిజర్వ్‌ చేసిన 7 షాపులకు గాను 50 ధరఖాస్తులు వచ్చాయన్నారు. జనరల్‌కు కేటాయించిన 35 వైన్‌ షాపులు 347 దరఖాస్తులు వచ్చాయన్నారు. గురువారం చివరి తేదీ కాగా ఈనెల 20వ తేదీన షాపులను లాటరీ ద్వారా కేటాయించి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ ఎల్లమ్మ గుడి ఫంక్షన్‌ హాల్లో లాటరీ ద్వారా షాపులను కేటాయిస్తారని జిల్లా ఎక్సైజ్‌ అధికారి తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement