Thursday, October 10, 2024

Seized – చెక్ పోస్ట్ తనిఖీలో రూ.3 లక్షల 30 వేల విలువైన మద్యం పట్టివేత

మోత్కూర్, నవంబర్ 12 (ప్రభ న్యూస్) మోత్కూర్ కి చెందిన అతిథి బార్ యాజమాన్యం ఐ ఎం ఎల్ (లిక్కర్) డిపో భోగారం నుండి డి సి ఎం లో రూ.3 లక్షల విలువ గల మద్యాన్ని మోత్కూర్ కి తెస్తుండగా ఎక్సైజ్ సిబ్బింది పట్టుకున్నారు. ఆత్మకూరు మండలం కపురాయిపల్లి చెక్ పోస్ట్ వద్ద ఎస్ ఎస్ టీమ్ వాహనాల తనిఖీలో బిల్లింగ్ లో వాహనం మోడల్, నంబర్ లో తేడా ఉండడంతో ా వాహనాన్ని మోత్కూర్ ఆబ్కారీ సర్కిల్ కార్యాలయానికి తరలించారు. రూ.3 లక్షల 30 వేల మద్యం స్టాక్ తో పాటు వాహనాన్ని సి ఐ స్వాధీనం చేసుకున్నారు. డిపోలో డి సి ఎం లోనే మద్యం లోడ్ తో బయలుదేరిన ఆ వాహనం కాస్త ఔషాపూర్ వద్ద చెడిపోవడంతో మరొక వాహనాన్ని రప్పించి ఆ స్టాక్ ను తరలిస్తున్నట్లు యాజమాన్యం చెబుతుండగా,ా సమాచారాన్ని ఆబ్కారీ అధికారులకు తెల్పకపోవడంతోనే వాహనాన్ని పట్టుకున్నట్లు సమాచారం. బిల్లింగ్ ఇన్వాయిస్ సక్రమంగా నే ఉన్నాయని,కేవలం వాహనాన్ని మార్చడంతోనే చెక్ పోస్ట్ లో ఆధారాలు సరిగా లేకపోవడంతో స్వాధీనపరుచుకున్నట్లు తెలిసింది


సి ఐ వివరణ : మద్యం లోడ్ వాహనాన్ని తమకు అప్పగించిన మాట వాస్తవమేనని, వాహనాన్ని మార్చడంతోనే అనుమానంతో పట్టుకున్నారని విచారణ చేస్తున్నట్లు,నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు మోత్కూర్ ఆబ్కారీ సర్కిల్ సి ఐ చంద్రశేఖర్ ఆంధ్రప్రభ ప్రతినిధికి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement