Monday, June 24, 2024

TS | నియోజకవర్గ అభివృద్ధికి రూ.12.50 కోట్లు.. ఎమ్మెల్యే విన్నపంతో ఉత్తర్వులు జారీ

పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి 12.50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గంలో 43 అభివృద్ధి పనులకు గాను నిధులు మంజూరు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విన్నవించారు.

ఈ మేరకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుండి 12.50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. నిధులు మంజూరు చేసేందుకు గాను ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్లకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement