Sunday, April 28, 2024

తెలంగాణలో వైఎస్ఆర్ పాలనకు పునాది: విజయమ్మ

తెలంగాణలో వైఎస్‌ఆర్‌ పాలనకు పునాదులు పడబోతున్నాయి వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ జెండాను వైఎస్ సతీమణి విజయమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తండ్రి కలలు సాకారం చేసేందుకే రాజకీయాల్లోకి షర్మిల వచ్చిందని తెలిపారు. తండ్రి ఆశయాల సాధనం కోసం మీముందుకు వస్తోందన్నారు. మీ కష్టాల్లో షర్మిల తోడుగా ఉంటుందని విజయమ్మ అన్నారు. 3 నెలల్లో ఎన్నో ఆరోపణలు, విమర్శలు షర్మిలపై వచ్చాయని అన్నారు. అన్ని వర్గాల కష్టాలు, సమస్యలను వైఎస్‌ పరిష్కరించారన్నారు. నాయకుడు అంటే అందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నారు. వైఎస్‌ తెలుగువారి గుండె చప్పుడని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో వైఎస్‌ ఉన్నారన్నారు. తెలంగాణ గడ్డను వైఎస్‌ ఎంతగానో ప్రేమించారని, వైఎస్‌కు వివక్ష అంటే తెలియదన్నారు. జనం కోసమే వైఎస్‌ జీవించారని… ఆయన కల అసంపూర్తిగా నిండిపోయిందన్నారు. వైఎస్ఆర్ హావభావాలు, ఆత్మీయత పుణికిపుచ్చుకున్న వారు జగన్, షర్మిల వ్యాఖ్యానించారు. ఇద్దరూ పట్టుదలకు చిత్తశుద్ధికి వారి నాన్నకు వారసులని పేర్కొన్నారు.

తెలంగాణలో కొత్త తరం రాజకీయానికి.. వైఎస్ఆర్ పాలనకు పునాదులు పడుతున్నాయి. ఓ ఆడబిడ్డ రాజకీయాలకు వచ్చిందంటే చులకనగా చూడరాదన్నారు. సింహం లాంటి నాయకులకు లింగ వివక్షత ఉండదన్నారు. షర్మిల తండ్రి జయంతి రోజు… నాయకురాలిగా పుట్టిందని తెలిపారు. ఈ గడ్డపై పుట్టిందా అన్న ప్రశ్నకు ఇక తావే లేదన్నారు. వైఎస్ కలలను సాకారం చేయడానికి మీ ముందుకు వస్తుందన్నారు. ఆరోజు జగనన్న బాణంగా 3200 కిమీ. పాదయాత్ర చేసిందని గుర్తుచేశారు. ఓ ఆడపిల్ల… అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం ఓ రికార్డు అని తెలిపారు. ఆ రోజున్న పరిస్థితులు … తలచుకుంటే… ఇప్పటికీ గగురుపొడుస్తోందని విజయమ్మ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement