Friday, March 1, 2024

నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్: వైఎస్ షర్మిల

తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి కొందరు ఆందోళన, మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి లవన్ కుమార్ అనే నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి మాటల తూటాలు పేల్చారు. నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద పదవులు అనుభవిస్తూ, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్..అంటూ ఫైర్ అయ్యారు. ఉద్యమకారుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడాలని విమర్శించారు. ఇంకెంత మందిని బలితీసుకొంటే నోటిఫికేషన్లు ఇస్తారు దొరా? అని ప్రశ్నించారు. మీకు కనికరం లేదు, కనీసం చీమ పారినట్టు కూడా లేదని మండిపడ్డారు. ఎందుకంటే చచ్చేది మీ బిడ్డలు కాదు కాబట్టి అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు సీట్లు, ఓట్ల మీదున్న ఆరాటం యువత ప్రాణాలు మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మహేష్, ఈ రోజు లవన్ కుమార్, శ్రీకృష్ణ.. ఈ ఏడాది దాదాపు 20 మందికి పైగా నిరుద్యోగులను చంపిన హంతకుడు కేసీఆర్ అని ఆరోపించారు. మరొక్క నిరుద్యోగి ప్రాణం పోకముందే నోటిఫికేషన్లు ఇవ్వాలని, లేదంటే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://www.facebook.com/andhraprabhanewsdaily

https://twitter.com/AndhraPrabhaApp,

Advertisement

తాజా వార్తలు

Advertisement