Thursday, April 25, 2024

YS Sharmila: బస్తీ దవాఖానాలకు సుస్తీ.. ధాన్యం కొనకుండా రాజకీయాలు

తెలంగాణ ప్రభుత్వంపై రోజుకో రకంగా విమర్శలు చేస్తున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై పలుమార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన షర్మిల.. తాజాగా వైద్య విధానాలపై మరోసారి విమర్శించారు.

‘’గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని YSR గారు 104 సేవలను ప్రవేశపెడితే, ఇప్పుడు కేసీఆర్ సర్కార్ ఇప్ప‌టివ‌ర‌కు ప్రారంభించ‌ని పల్లె దవాఖానాల పేరిట 104 సేవలను బంద్ పెట్టాలని చూస్తోంది. మీరు ప్రవేశపెట్టిన కంటి వెలుగు కంటికి కనపడకుండా పోయింది, బస్తీ దవాఖానాలకు సుస్తీ చేసింది. ’’అని విమర్శించారు.

‘’కొంటాడో కొనడో తెలియక ధాన్యం కుప్పల మీదే రైతు గుండెలు ఆగిపోతుంటే KCR గారు మాత్రం ధాన్యం కొనకుండా రాజకీయాలు చేస్తున్నాడు. ఇప్పటికే 2 నెలలుగా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ రైతులు గోస పడుతున్నారు. రైతులు తిరగపడక ముందే పంట మొత్తం కొనాల్సిందే. లేకపోతే KCR మూట ముళ్ళె సర్దుకోవాల్సిందే.’’ అని షర్మిల ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement