Sunday, May 29, 2022

నా సాయంత్రం బాల‌కృష్ణ‌తో .. మ‌హేశ్ బాబు ..

హీరో నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారిగా బుల్లితెర‌పై హోస్ట్ గా మెరిశారు. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఆయ‌న అద‌ర‌గొడుతున్నారు. కాగా ఈ షోలో ప‌లువురు సెల‌బ్రిటీలు సంద‌డి చేస్తున్నారు. ఈ షో నాలుగో ఎపిసోడ్ లో సంద‌డి చేయ‌నున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేశ్ బాబు. తాజాగా ఎన్‌బికెతో అన్‌స్టాపబుల్ షూటింగ్ సమయంలో బాలకృష్ణతో కలిసి ఉన్న ఫోటోను మహేష్ పంచుకున్నారు.

నా సాయంత్రాన్ని ఎన్బీకే గారితో ‘అన్‌స్టాపబుల్’గా ఆనందించానని ఫొటోని సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు.. కాగా ఈ షూటింగ్ నిన్నటితో ముగిసింది. ఈ ఎపిసోడ్‌ ని చూసేందుకు ఇరువురు నటుల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ఈ నెల 17న విడుదలకానుంది. అయితే ఈ విషయమై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement