Friday, April 26, 2024

తెలంగాణకు ఎల్లో అలర్ట్‌, నాలుగు రోజుల పాటు వర్షాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. చత్తీస్‌ఘడ్‌ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకూ ఉపరిత ద్రోణి గాలులతో పాటు కర్ణాటకపై 3.1 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

వీటి ప్రభావంతో శనివారం నుంచి రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు మోస్తరు, వర్షాలు పడే అకాశం ఉన్నట్లు ఎల్లోఅలర్ట్‌ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని ప్రకటించింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలలో సాధారణ స్థాయి కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement