Wednesday, May 15, 2024

By Poll: మునుగోడులో బీజేపీ బహిరంగ సభ ఉంటుందా! ఉండదా?.. సందిగ్ధంలో పార్టీ కేడర్​!

తెలంగాణలో టీఆర్​ఎస్​ వర్సెస్​ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్ట్రబ్​ చేసేందుకు బీజేపీ యత్నించిందనే వార్తలు, చర్చలు, వాదనలు, డిబేట్లు జనాలను పరేషాన్​ చేస్తున్నాయి. దీనికి తోడు ఇవ్వాల (శుక్రవారం) సోషల్​ మీడియాలో, టీవీ న్యూస్​లో హల్​చల్​ చేస్తున్న రెండు ఆడియో క్లిప్పులు కూడా బీజేపీని దోషిగా నిలబెడుతున్నాయంటున్నారు పరిశీలకులు.

కానీ, ఈ వార్తలను, ఆడియో క్లిప్పులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కొట్టిపడేస్తున్నారు. ఇది బేజీపీ పని కాదని, కావాలంటే తామే నేరుగా చేర్చుకుంటాం కానీ, స్వామీజీలతో డీల్​ చేయబోమని కిషన్​రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇక.. బండి సంజయ్​ అయితే ఏకంగా యాదాద్రి నర్సింహస్వామి ఆలయంలోకి వెళ్లి తడిబట్టలతో ప్రమాణం కూడా చేశారు. ఇట్లా రెండు పార్టీల మధ్య వైరుధ్యాలు, జరుగుతున్న చర్చలు, వాదనల నడుమ మునుగోడు ప్రచారం యథాతథంగా కొనసాగుతోంది.

కానీ, ఈ నెల 31న మునుగోడులో జరుప తలపెట్టిన బీజేపీ బహిరంగ సభ విషయంలో కొంత సందిగ్ధత నెలకొందంటున్నారు పార్టీ నేతలు. పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడనికి ముందే సన్నాహాలు చేసుకున్నారు. కానీ, ఈ రెండ్రోజుల నుంచి టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి జరుగుతున్న చర్చల మధ్య మునుగోడు సభ ఉంటుందా, ఉండదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఆ పార్టీ నేతలు కూడా దీనిపై క్లారిటీ ఇవ్వడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement