Friday, May 10, 2024

Spl Story: వాటీజ్​ దిస్​ నాన్సెన్స్​!! ఇట్లా లొల్లి జేస్తే అవతలోల్లకు అగ్గువ కామా?

‘‘వాటీజ్​ దిస్​ నాన్సెన్స్​.. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలే.. సముదాయించుకోవాలే.. కానీ పార్టీని బజారునపడేయడం ఎందుకు? అంతా తెలిసిన వాళ్లే నలుగురిలో చులకవన అవడం ఎందుకు? ఇట్లాగేనా వ్యవహరించేది? ఇట్లయితే అవతలి పార్టీ వాళ్లకు మనం చాన్స్​ ఇచ్చినట్టు కాదా?!! ” అంటున్నారు టీఆర్​ ఎస్​ అభిమానులు.. సొంత పార్టీలోనే లీడర్ల మధ్య ఉన్న వైరుధ్యాలు, విపరీత పోకడలపై అధిష్ఠానం సీరియస్​గా తీసుకుని సెట్​ రైట్​ చేయకుంటే ముందు ముందు బ్యాడ్​ నేమ్​ తప్పదంటున్నారు అనలిస్టులు..

అధికార టీఆర్ ఎస్ పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు ఉన్నాయా? ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌డం లేదా? మంత్రుల‌పై ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ లీడ‌ర్లు సీరియ‌స్ అవుతున్నారా? అంటే అవున‌నే అంటున్నాయి రంగారెడ్డి జిల్లా ప‌రిస్థితులు. ఇట్లాంటి ప‌రిస్థితులు ఎందుకొస్తున్నాయ‌నే దానిపై అధిష్ఠానం సీరియ‌స్‌గా దృష్టిపెట్ట‌క‌పోతే ఆ త‌ర్వాత ప‌రిస్థితి చేయిదాటిపోయే ప్ర‌మాదం ఉందంటున్నారు పొలిటిక‌ల్ అన‌లిస్టులు..

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : ఇప్ప‌టికే టీఆర్ ఎస్‌లో లుకలుకలు ప్రారంభమైయ్యాయి. ఎన్నికలకు ఇంకా సమయమున్నా అప్పుడే ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటికే తాండూర్ లో నువ్వా నేనా అన్నట్లుగా మారింది. చేవెళ్ల లో కూడా అదే పరిస్థితి నెలకొంది. తాజాగా మహేశ్వరం లో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. మంత్రి సబితారెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. దీన్ని విప‌క్ష పార్టీలు అడ్వంటేజ్‌గా తీసుకునే చాన్స్ అధికార పార్టీ ఇవ్వొద్ద‌ని కార్య‌క్త‌లు పార్టీ నేత‌ల‌కు, అధిష్టానానికి రిక్వెస్ట్ చేస్తున్నారు.

రాష్ట్రంలో మూడోసారి అధికారం వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని సీ ఎం కేసీఆర్…యువనేత కేటీఆర్ ప్రయత్నిస్తుండగా నియోజక వర్గాల్లో మాత్రం నేతల మధ్య అప్పుడే టికెట్ల పంచాయతీ ప్రారంభమైంది. ప్రతిపక్షాలకు ఏమాత్రం తీసిపోకుండా విమర్శలు చేసుకుంటున్నారు. ఇంకా ఎన్నికలకు సమయ మున్నా అప్పుడే టికెట్ల కోసం సొంత పార్టీ నేతలు ఒకరిని మరొకరు టార్గెట్ చేసుకుంటున్నారు. రేసులో ఉన్న నేతలు తగ్గేది లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాండూర్ లో ఎమ్మెల్యే… ఎమ్మెల్సీ ల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా నియోజకవర్గం లో పర్యటనలు చేస్తున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకుంటున్నారు.

- Advertisement -

చేవెళ్ల లో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే….మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం నెలకొంది. ఇటీవలి కాలంలో వీరిద్దరూ నేరుగా విమర్శలు చేసుకున్నారు. కబ్జా కోరు నీవంటే నీవని విమర్శలు చేసుకున్నారు. కల్వకుర్తి నియోజక వర్గంలో కూడా అదే సీన్ నెలకొంది. అక్కడ ఎమ్మెల్యే…ఎమ్మెల్సీ ల మధ్య వివాదం నెలకొంది. వీరిద్దరూ టిక్కెట్టు ఆశిస్తున్నారు…

మహేశ్వరం లో కూడా…
విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజక వర్గంలో కూడా వివాదం నెలకొంది. మంత్రి సబితారెడ్డి నీ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం చర్చనీయాంశం గా మారింది. కబ్జా లను మంత్రి ప్రోత్స హిస్తున్నార నీ ఆరోపణలు చేశారు. తాను తమ పార్టీ ఎమ్మెల్యే కాదని తేల్చి చెప్పారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో తీగల మహేశ్వర నియోజక వర్గంలో తెరాస అభ్యర్థిగా పోటీ చేశారు. సబితా రెడ్డి కాంగ్రెస్ నుండి బరిలో నిలిచి విజయం సాధించారు. ఏడాదిలో తెరాస లో చేరడం మంత్రి అయ్యారు. అప్పటినుండి తీగల అసంతృప్తి తో ఉన్నారు. తాజాగా మంత్రిని లక్ష్యంగా చేసుకుని తీగల విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది….

తీగల పార్టీ మారతారని ప్రచారం….
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనెల 11 న కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే మంత్రి సబితారెడ్డి పై విమర్శలు చేశారనే ప్రచారం సాగుతోంది. ఇటీవల తీగల మంత్రి కేటీఆర్ ను కలిశారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి తీగలను తీసుకొని కేటీఆర్ ను కలిసి చర్చించారు. మార్చిలో ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తామని కూడా హామీ కూడా ఇచ్చినట్లు తెలిసింది. కొన్ని రోజులకే మంత్రి సబితారెడ్డి పై విమర్శలు చేయడం చర్చనీయాంశం గా మారింది. గతంలో కూడా తీగల పార్టీ మారతారని ప్రచారం కూడా జరిగింది. బీజేపీ లోకి వెళ్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద అధికార పక్షంలో గొడవలు ప్రారంభ మయ్యాయి. వీటికి బ్రేకులు వేస్తారా అలాగే వదిలి వేస్తారా వేచి చూడాలి….

Advertisement

తాజా వార్తలు

Advertisement