Thursday, April 25, 2024

దేశాన్ని రక్షించాలనుకుంటున్న వారికి ఆయుధాలు : జెలెన్‌స్కీ

ఉక్రెయిన్​పై రష్యా దాడి చేస్తున్న క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశాన్ని ర‌క్షించాల‌నుకుంటున్న ఎవ‌రైనా ముందుకు రావాల‌ని.. వారికి ఆయుధాలు ఇస్తామ‌ని జెలెన్‌స్కీ తెలిపారు. దేశాన్ని రక్షించాలనుకుంటున్న పౌరులు ఎవరికైనా.. ఆయుధాలు ఇస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్​కు మద్దతుగా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే తమ దేశంపై యుద్ధానికి దిగిన రష్యాపై ప్రతీకార చర్యలు చేపట్టింది ఉక్రెయిన్​. రష్యాతో ఉన్న దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement