Friday, May 10, 2024

Special Story: కింగ్‌ మేకర్‌ మనమే!

- Advertisement -

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: జనసేన పార్టీని బలోపేతం చేసి మెజార్టీ స్థానాలను సొంతం చేసుకుని ముఖ్యమంత్రి కావాలన్నది ఆ పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆశయం..లక్ష్యం. వీటన్నింటి కంటే ముందు రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వాన్ని అడ్డుకోవ డంతో పాటు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండాలన్నది పవన్‌ ముఖ్య ఉద్దేశ్యం.. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి వైసీపీని ఓడించేందుకు కూటమిగా ముందుకు సాగుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల మిత్రపక్షాలుగా పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆ పార్టీకి 21 ఎమ్మెల్యే సీట్లు, 2 లోక్‌సభ స్థానాలను కూటమికేటాయించింది.

దీంతో కొన్ని నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన జనసేన నేతల్లో కొంత అసహనం, అసంతృప్తి, ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. ఆయా జిల్లాల్లో జనసైనికుల్లో కూడా తమ నేతలకు టికెట్‌ రాలేదన్న ఆవేదన బలంగా వినిపిస్తోంది..కనిపిస్తోంది. దీంతో ఇటీవల ముఖ్య నేతలతో సమావేశమైన పవన్‌ కంగారొద్దు..! ఎవరూ అధైర్య పడవద్దు.. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు మనకు సెమీ ఫైనల్స్‌ మాత్రమే.. 2029 ఎన్నికల్లో మనమే ఫైనల్‌ ఆడుదాం.. అప్పటివరకు అందరూ ఓర్పు, సహనంతో ఉండాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయడంతో పాటు జనసేన నుంచి పోటీ చేస్తున్న 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 2 లోక్‌సభ స్థానాల నుంచి బరిలో ఉన్న ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ క్యాడర్‌కు ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. కూటమి నుంచి బరిలో ఉన్న ప్రతి అభ్యర్థిని గెలిపించుకోవడం తమ బాధ్యతగా ప్రతిఒక్కరు ముందుకు సాగాలని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.

మనమే కీలకం…
రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వాన్ని మార్చేయాలి.. 2019 ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి కలిసొచ్చింది. జనసేన అభ్యర్థులు ఓట్లు చీల్చడం ద్వారా తెలుగుదేశానికి ఉహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇటు వంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మరోసారి జగన్‌ కు అధికారం అందకుండా చేయాలి. అందుకోసం అందరం కలిసికట్టుగా పోరాడుదామని పవన్‌ జనసైనికులకు పదే పదే చెబుతూ వస్తున్నారు. రాష్ట్రంలో అధికారం మారాలి.. మనమే కింగ్‌ మేకర్‌ కావాలి. ఆ దిశగా ప్రస్తుత ఎన్నికలను ప్రతిఒక్కరు ఓ సవాల్‌గా తీసుకుని పనిచేయాలని సూచిస్తు న్నారు. కూటమి గెలుపొందితే ఖచ్చితంగా రాష్ట్రంలో మనమే కింగ్‌ మేకర్‌ అవుతాం..ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు, సందేహాలు అవసరం లేదు. ఖచ్చితంగా ఉప ముఖ్య మంత్రిగా తమకు అవకాశం వస్తుం దని, ఇదే సందర్భంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ తాము ప్రధాన భాగస్వా ములుగా ఉండబోతున్నాం.. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అంతా ఐక్యంగా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయా లని పవన్‌ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లోపు..పార్టీ నిర్మాణం, విస్తరణ
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా నేతలంతా తమ శక్తి మేరకు కృషి చేయాలి. కూటమి విజయం సాధిస్తే రానున్న ఐదేళ్లలో జనసేన మరింత బలపడడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టంగా చేపట్టడంతో పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జనసేనను విస్తరింప చేసుకునేందుకు మంచి అవకాశం లభిస్తుందన్న యోచనలో పవన్‌ ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ శ్రేణులకు కూడా ఆయన ఇదే అంశాన్ని పదే పదే చెబుతున్నట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికల్లో అభిమానుల కోరిక కూడా నూటికి నూరు శాతం నెరవేరు తుందన్న విశ్వాసాన్ని కూడా పవన్‌ పార్టీ క్యాడర్‌లో బలంగా కల్పిస్తున్నారు. రాష్ట్రంలో జనసేన బలోపేతం కావాలంటే ప్రస్తుత ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఖచ్చితం గా జరిగి తీరాలని, ఈ అంశాన్ని ప్రతిఒక్కరు సీరియస్‌గా తీసుకుని పనిచేయాలని ఆయన చెబుతున్నారు. తనపై నమ్మకాన్ని ఉంచి పార్టీ భవిష్యత్తు, క్యాడర్‌ భవిష్యత్తు తనకు వదిలేసి ప్రస్తుత ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచే యాలని సూచిస్తున్నారు. గ్రూపు తగాదాలు, వివాదాలు పక్కన పెట్టి తెలుగుదేశం, బీజేపీ నేతలతో సమన్వయం చేసుకుని బలంగా ముందుకు సాగాలని చెబుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో జనసేన నుంచి టికెట్లు ఆశించి రానివారు నమ్మకంతో ఉంటే వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవ డంతో పాటు ఎన్నికల ఫలితాల అనంతరం వారికి తగిన ప్రాధాన్యతను కల్పిస్తానని ఆయా జిల్లాలకు చెందిన నేతలకు ఆయన భరోసా ఇస్తున్నారు. ఆ దిశగా పవన్‌ ప్రతి అంశాన్ని ఓ సవాల్‌గా తీసుకుని ప్రస్తుత ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో జనసేన ఫైనల్‌ ఆడి తీరుతుందన్న నమ్మకం, పట్టుదలను జన సైనికుల్లో ఇప్పటి నుంచే కల్పించేలా ఆయన దూకుడుగా సార్వత్రిక ఎన్నికల్లో దూసుకుపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement