Monday, April 22, 2024

Warning: ముంబైని పేల్చేస్తా.. బెదిరింపు కాల్..

ముంబైని త్వ‌ర‌లో పేల్చేస్తాన‌ని ఓ వ్య‌క్తి బెదిరించాడు. మే 22వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు ముంబై పోలీసుల‌కు ఆ మెసేజ్ అందింది. ట్విట్ట‌ర్‌లో బెదిరింపుల‌కు పాల్ప‌డిన ఆ వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు ఆ వ్య‌క్తి గురించి ఆరా తీసి అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపు మెసేజ్ చేసిన ఆ వ్య‌క్తిని మ‌రింత లోతుగా విచారించ‌నున్నారు. ఈ ఘ‌ట‌న గురించి ముంబై పోలీసులు త్వ‌ర‌లో మ‌రింత స‌మాచారాన్ని వెల్ల‌డించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement