Thursday, April 25, 2024

వాంటెడ్ పండుగాడ్ మూవీ రివ్యూ-క‌మెడియ‌న్ల కామెడీ పండిందా

నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది వాంటెడ్ పండుగాడ్ మూవీ. క్యాప్ష‌న్ ప‌ట్టుకుంటే కోటి..కాగా ఈ చిత్రంలో ఎంతోమంది కమెడియ‌న్స్ న‌టించారు.మ‌రి ఈ మూవీ హిట్టా..ఫ‌ట్టా తెలుసుకుందాం.

క‌థ ఏంటంటే- టాలీవుడ్ క‌మెడియ‌న్స్ తో తెర‌కెక్కింది పండుగాడ్‌..విభిన్న నేప‌ధ్యాలు.. అవసరాలు కలిగిన కొందరు వ్యక్తుల టార్గెట్ పండుగాడ్.కాగా పండుగాడ్ గా సునీల్ న‌టించాడు. సునీల్ ని పట్టుకోవాలని ఎవరికి వారు తమ ప్రయత్నాలు మొదలుపెడతారు. అసలు ఈ పండుగాడ్ ఎవరు? మాఫీయా, పోలీసులతో పాటు సాధారణ జనాల టార్గెట్ ఎందుకయ్యాడు? అసలు పండుగాడ్ని పట్టుకోవడం వల్ల వాళ్లకు జరిగే ప్రయోజనం ఏమిటీ అనేదే క‌థ‌.

విశ్లేష‌ణ‌- ఈ చిత్రంలో కూడా పదుల సంఖ్యలో కమెడియన్స్ నటించారు. ఒకప్పటి జబర్దస్త్ యాంకర్స్, కమెడియన్స్ తో చిత్రాన్ని నింపేశారు. ప్రధాన పాత్ర చేసిన సునీల్ తో పాటు బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, సుడిగాలి సుధీర్, సప్తగిరి, తనికెళ్ళ భరణి, ఆమనీ, పృథ్వి, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, అనసూయ, దీపికా పిల్లి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది ఈ మూవీలో నటించారు.ఈ పాత్రలన్నీ తమ తమ ప్రయోజనాల కోసం పండు గాడిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మూవీలో ఓ కథ, స్క్రీన్ ప్లే అంటూ ఉండదు. ఎక్కడిక్కడ కమెడియన్స్ తో కామెడీ ట్రాక్స్ నడుస్తూ ఉంటాయి. సిట్యువేషనల్ కామెడీ ప్రధానంగా సాగుతుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే జబర్దస్త్ కామెడీ టైప్ అన్న మాట.కామెడీకి తోడు అనసూయ, దీపికా పిల్లి, విష్ణు ప్రియ లాంటి యాంకర్స్ చేత స్కిన్ షో చేయించారు. ఆ విధంగా రొమాంటిక్ అండ్ గ్లామర్ యాంగిల్ కవర్ చేసే ప్రయత్నం చేశారు.

- Advertisement -

టెక్నీషియ‌న్స్ : సాంగ్స్, బీజీఎమ్ ఏమాత్రం ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు కూడా అంత ఉన్నతంగా లేవు. లెక్కకు మించిన స్టార్ కమెడియన్స్ ఉన్నా… ఎవరి పాత్రకు వారు న్యాయం చేయలేదు. నిమిషాల వ్యవధిలో పాత్రలు తెరపై మారిపోతూ ఉంటాయి. బ్రహ్మనందం కూడా అంతంత మాత్రమే. అయితే ఎవరి పాత్ర మేరకు వాళ్ళు మెప్పించే ప్రయత్నం చేశారు.

నటీనటులు: సునీల్, శ్రీమతి అనసూయ, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి, డా. బ్రహ్మానందం, రఘు బాబు, అనంత్, పుష్పా జగదీష్, నిత్యా శెట్టి, వాసంతి, విష్ణుప్రియ, హేమ, షకలక, తనికెళ్ల భరణి త‌దిత‌రులు ఎవ‌రిప‌రిధిలో వారు న‌టించారు.. శ్రీధర్ సీపాన దర్శకత్వం వ‌హించారు. మహి రెడ్డి పండుగల సినిమాటోగ్రఫీ ..సంగీతం: పి.ఆర్.. సమర్పణ: కే రాఘవేంద్రరావు. నాణ్యమైన కామెడీ ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చదు. నాన్ సింక్ కామెడీ అందరికి నచ్చక పోవవచ్చు. అయితే ఓ వర్గం ప్రేక్షకులు ఎంటర్టైన్ కావచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement