Friday, May 3, 2024

వావ్ ఒకే సంస్థ‌లో 84ఏళ్ళ జాబ్ -గిన్నిస్ బుక్ లో చోటు

ఉద్యోగం అంటే ఒకే చోట స్థిరంగా ఉండి చేసేది కాదు..ప‌లు కంపెనీలు ప‌లుమార్లు మారుతూనే ఉంటాం. అయితే ఇక్క‌డో పెద్దాయ‌న ఒకేచోట 84సంవ‌త్సరాలు ఏక‌థాటిగా జాబ్ చేస్తూ రికార్డ్ సృష్టించారు. దాంతో ఆయ‌న గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు.
ఆ పెద్దాయన పేరు వాల్టర్ ఆర్థమాన్. వయసు వందేళ్లు. తాను దేని గురించీ పెద్దగా టెన్షన్లు తీసుకోనని, తనకు రేపు అంటే మరో రోజు అని అన్నారు. ఉండేది బ్రెజిల్ లోని బ్రస్క్యూ అనే ఓ చిన్న పట్టణం. వయసులో ఉన్నప్పుడు ఇండస్ట్రియాస్ రెనాక్స్ ఎస్ఏ అనే సంస్థలో ఉద్యోగంలో చేరాడు. 1938లో 14 ఏళ్ల పడుచు ప్రాయంలో ఆ సంస్థలో షిప్పింగ్ అసిస్టెంట్ గా ఉద్యోగం స్టార్ట్ చేసిన వాల్టర్.. అంచెలంచెలుగా ఎదిగారు. షిప్పింగ్ అసిస్టెంట్ నుంచి సేల్స్ పొజిషన్ కు, అక్కడి నుంచి సేల్స్ మేనేజర్ గా పదోన్నతి సాధించారు. తన ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో మార్పులు చూశానని వాల్టర్ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 19నే వాల్టర్ వందో పడిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, తాను పనిచేసిన సంస్థ సిబ్బంది స్పెషల్ గా సెలబ్రేట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement