Friday, April 26, 2024

పోలీసులు సమక్షంలో వాహనాలు ధ్వంసం: ఆత్మకూరు ఘటనపై విష్ణు ఫైర్

కర్నూలు జిల్లా ఆత్మకూరులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిపై దాడి ఘటనను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అక్రమంగా నిర్వహిస్తున్న నిర్మాణాలను ప్రజలతో కలసి ప్రశ్నించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి సత్యనారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి , జై చంద్రల పై హత్యాయత్నాన్ని రాష్ట్ర బీజేపీ త్రీవ్రంగా ఖండిస్తుందన్నారు. ప్రజలపైన రాళ్ళు దాడి చేయడమమే కాకుండా పోలీసుల సమక్షంలో నేతల వాహనాలను ధ్వంసం చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. సంఘటనకు కారులైన వారిపై హత్యానేరం కేసులు నమోదు చేయాలని బాధితులకు వెంటనే రక్షణ కల్పించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాగా, కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిన్న రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆత్మకూరులోని పద్మావతి పాఠశాల వెనకాల మసీదు నిర్మాణం విషయంలో వివాదం చెలరేగింది. మసీదును అక్రమంగా నిర్మిస్తున్నారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. దీంతో అక్కడి నుంచి శ్రీకాంత్‌రెడ్డి నేరుగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం వారు పోలీస్ స్టేషన్‌ను దిగ్బంధించి శ్రీకాంత్‌రెడ్డిపై ఒక్కసారిగా దాడి చేశారు. శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు చేశారు. దీంతో ఆత్మకూరు పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement