Sunday, May 5, 2024

Vijay Devarakonda: ట్విట్టర్ లో పేరు మార్చిన రౌడీ స్టార్..

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో తన పేరు మార్చడం వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్ పక్కన ‘తుఫాన్’ అనే పదాన్ని యాడ్ చేశాడు. అయితే, ఉన్నట్టుండి విజయ్ దేవరకొండ ఇలా పేరు మార్చడం వెనుక కారణం ఏంటని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఓవైపు సినిమాలు మరోవైపు కమర్షియల్ యాడ్స్ తో పుల్ స్వింగ్ లో ఉన్నాడు విజయ దేవరకొండ. కెరీర్ పరంగా డిఫరెంట్ సబ్జెట్ ఎంచుకుంటూ యుత్ లో తనకంటూ ఓ బ్రాండ్ ను సొంతం చేసుకున్నాడు. ఇందులో భాగంగానే యాడ్ షూట్స్ చేయడంలోనూ ప్రత్యేకత చూపిస్తుంటాడు. ఓ సాఫ్ట్ డ్రింక్ యాడ్ ప్రమోషన్ కోసం ఇలా ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్ మార్చేశాడు.

కాగా, ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. మూవీలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌ను కీలక పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement