Tuesday, April 16, 2024

కరోనాపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం : రాష్ట్ర‌ప‌తి

క‌రోనాపై భార‌త్ పోరాటం స్ఫూర్తిదాయ‌క‌మ‌ని రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ…. దేశం కోసం ప్రాణ‌త్యాగం చేసిన వీరుల‌కు నా వంద‌న‌మ‌న్నారు. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ లో మ‌హిళ‌ల పాత్ర కీల‌క‌మ‌న్నారు. పేద‌ల ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ భార‌త్ ఎంతో కీల‌క‌మ‌న్నారు. క‌రోనాను ఎదుర్కోవ‌డానికి ఫార్మా రంగం ఎంతో కృషి చేస్తోంద‌న్నారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 180 దేశాలు మ‌న ఫార్మా రంగం నుంచి ల‌బ్ది పొందుతున్నాయ‌న్నారు. డ‌బ్ల్యూహెచ్ఓ తొలి ట్రెడిషిన‌ల్ మెడిసిన్ సెంట‌ర్ భార‌త్ లో ఏర్పాటు కాబోతోంద‌న్నారు. ప‌ద్మ పుర‌స్కారాల‌ను సామాన్యుల వ‌ర‌కు తీసుకెళ్ల‌గ‌లిగామ‌న్నారు. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ యోజ‌న ద్వారా 19నెల‌ల పాటు పేద‌ల‌కు ఉచిత రేష‌న్ అందించామ‌న్నారు. ప్ర‌పంచంలో మ‌న‌దే అతిపెద్ద ఆహార స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ అన్నారు. చిరు వ్యాపారుల‌కు కేంద్రం సాయ‌మందిస్తోంద‌న్నారు. పేద‌ల‌కు నేరుగా న‌గ‌దు బ‌దిలీ అవుతోంద‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement