Wednesday, April 17, 2024

Video: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు.. వీడియో ఇదిగో!

తమిళనాడు కూనూర్‌ (సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్ చ‌నిపోయారు. రావత్ తో పాటు ఆయన భార్య మధులిక రావత్, మరో 11 మంది ఆర్మీ అధికారులు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో ప్రసంగించేందుకు బిపిన్ రావత్‌ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. బిపిన్‌ రావత్‌ మరణంతో సైనిక దళాలతో పాటు దేశం మొత్తం తీవ్ర విచారంలో మునిగిపోయింది. అయితే పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీ‌‌‌‌-5 హెలికాప్టర్‌ (Mi-17V-5chopper) ప్రమాదానికి గురైనట్లు.. దీంతో అందులో పయనిస్తున్న 13మంది చ‌నిపోయార‌ని వైమానిక శాఖ ప్రకటించింది.

వీరికి ఢిల్లీ కంటోన్మెంట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ ప్రమాదంలో గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయనకు వెల్లింగ్టన్‌ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో బిపిన్ రావత్‌ తో పాటు ఆయన భార్య మధులిక బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిడ్డర్, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జీందర్‌‌సింగ్, వింగ్‌కమాండర్ పీఎఎస్‌చౌహాన్, స్క్వాడ్రన్‌ లీడర్‌‌ కె.సింగ్, నాయక్‌ జితేందర్‌‌కుమార్, నాయక్‌ గురుసేవక్‌ సింగ్‌, లాన్స్‌నాయక్‌ బి.సాయి తేజ, లాన్స్ నాయక్‌ వివేక్, హవల్దార్‌‌ సత్పాల్, దాస్, ప్రదీప్‌ ఉన్నారు.వీరిలో లాన్స్‌నాయక్‌ సాయితేజ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందినవారు. బిపిన్‌ రావత్‌కు సాయి భద్రత అధికారిగా పని చేస్తున్నారు.

అయితే సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి ముందు కొన్ని దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం చివరి క్షణంలో బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌‌.. దట్టమైన పొగమంచులోకి వెళ్లడం ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది. తర్వాత కొన్ని క్షణాలకే హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ దృశ్యాలను స్థానికులు వారి మొబైల్స్ లలో రికార్డు చేశారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement