Wednesday, May 1, 2024

నేను సెల‌క్టివ్ చిత్రాలు చేయ‌డం లేదు….

నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన మిక్కీ జె మేయర్‌ అన్నీ మంచి శకునములే చిత్రం గురించి, ఇతర విషయాల గురించి మీడియాతో ముచ్చటించారు.
నందిని రెడ్డిగారు కథ చెప్పినప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏమి షేర్‌ చేసుకున్నారు?
కథ విన్నాక సంగీతం ఎలా ఇవ్వాలనేది అర్తమైంది. విక్టోరియా పురం అనే ఊరి కథ కాట్టి దానికి తగిన విధంగా మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ వుం డాలి. అదో కొత్త ప్రపంచం. ఎందుకంటే లిటిల్‌ బిట్‌ ఆప్‌ బ్రిటీ-ష్‌ -టె-ప్‌ లో వుంటు-ంది. వాటికి ట్యూ న్‌ మ్యాచ్‌ అయ్యే విధంగా చూసుకున్నాను.

సినిమాబాగుంటే సంగీత దర్శకులు పెద్దగా ఇబ్బంది ప డాల్సిన అవసరం లదుగా?
సహజంగా ఏ సినిమా-కై-నా వందశాతం కృషి ఉంటుంది. ఒకవేళ సినిమా బాగోకపోతే ప్రతీ దానికీ విమర్శలు ఎదురవుతాయి.
మహానటిచిత్రం తర్వాత వైజయంతి మూవీస్‌ లో పనిచే యడం, ఈ నిర్మాత లతో మీకు న్న అనుబంధం ఎలా వుంది?
స్వప్న, ప్రియాంక అశ్వనీ దత్‌ గారు, నాగ్‌ అశ్విన్‌ తో పనిచేయడం ఒకరకంగా కష్టమైన జాబ్‌ అయినా కంపోజర్స్‌ ఆలోచనలు వారు గౌరవిస్తారు. అన్నీ మంచి శకునములే రెండేళ్ళనాడే మొదలైంది.
మీరు ఎక్కువగా విదేశాల్లో ఉంటారు. స్థానికంగా వుంటే చిత్రసంబం ధికులతో చర్చించే అవకాశం వుంటు-ంది కదా?
ఇప్పటివరకు అలాంటి ఫిర్యాదులు లేవు. నా వర్కింగ్‌ స్టయిల్‌ హ్యాపీడేస్‌ లోనే కనిపిస్తుంది. నేను ఏ సినిమాకూ మ్యూజిక్‌ సిట్టింగ్‌ లో పాల్గొనలేదు. కేవలం ఫోన్‌ లోనే మాట్లాడుతుండేవాడిని. నేను కంపోజ్‌ చేసినవి దర్శకుడికి వినిపించేవాడిని. నా మ్యూజీషియన్‌ టీ-మ్‌ కూడా ఎక్కువగా లండన్‌, అమెరికాలలో వుంటు-ంటారు. అందుకే నేను విదేశాల్లో వుండాల్సివస్తుం దనుకుంటు-న్నా. ఇప్పటివరకు అలాగే చేస్తున్నాను.
మీరు సెలెక్టివ్‌ గా సినిమాలు చేస్తుంటారా? మీ పని విధానం ఎలా ఉండాలనుకుంటారు?
ప్రారంభంలో కొంతకాలం అంటే 10 సంవత్సరాలు అలా చేశాను. అప్పట్లో ఏడాదికి 4,5 సినిమాలే చేసేవాడిని. ఫ్యామిలీ పిల్లల బాధ్యత ఉండేది. నాకు పెద్దగా ఫ్రెండ్స్‌ కూడా లేరు. అందుకే ప్రస్తుత పరిస్థితులను బట్టి గత రెండేళ్ల నుంచి ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటు-న్నాను. నేను సినిమాలను ఎంపిక చేసుకోవడం లేదు. పీపుల్‌ నన్ను అలా కోరుకుంటు-న్నారు.
అన్నీ మంచి శకునములే మీకు ఎంత స్పెషల్‌ అని చెప్పగలరు?
ఈ సినిమాను 2020 లో మొదలు పెట్టాం. -టె-టిల్‌ సాంగ్‌ అక్టోబర్‌ 2020లో ప్రారంభించాను. అప్పటినుంచీ ఈ సినిమాపై పనిచేస్తూనే వున్నాను. ఒకరకంగా -టె-ర్డ్‌ అయినట్లు- అనిపిస్తుంది. ఫైనల్‌ గా థియేటర్‌ కు వచ్చేసింది. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇందులో చాలామంది సీనియర్స్‌ నటించారు. వారందిరికీ తగినవిధంగా మ్యూజిక్‌ ఇవ్వడం ఈ సినిమాలోని ప్రత్యేకత.

Advertisement

తాజా వార్తలు

Advertisement