Saturday, April 20, 2024

Flash: జైలు నుంచి వనమా రాఘవ విడుదల

ఖమ్మంలో జిల్లాలో సంచలనం రేపిన కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ శుక్రవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో వనమా రాఘవ నిందితుడిగా ఉన్నారు. జైలులో ఉన్న రాఘవకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైళ్ల శాఖ ఐజి ఆదేశాల మేరకు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు వనమా రాఘవ రిలీజ్ అయ్యారు.

కాగా, ఈ కేసులో వనమా రాఘవ అరెస్ట్ అయి దాదాపు 61 రోజులుగా జైలులో ఉన్నారు. వనమా రాఘవేంద్రరావుకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కే లలిత గురువారం బెయిల్‌ మంజూరు చేశారు. రాఘవ వేధింపులు భరించలేక కొత్తగూడెంలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. గత మూడు నెలలుగా జైలులో ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడంతో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలోకి రాకూడదని, వారానికోసారి ఖమ్మం టౌన్ 1 పోలీసుల ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రలోభ పెట్టడం, భయపెట్టడం, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయరాదని కోర్టు స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement