Tuesday, October 15, 2024

న‌దిలో కొట్టుకుపోయిన కారు-తొమ్మిది మంది మృతి

ప‌లు రాష్ట్రాల‌ని భారీ వ‌ర్షాలు కుదిపేస్తున్నాయి. కాగా ఓ కారు న‌దిలో కొట్టుకుపోయింది.ఈ ఘ‌ట‌న‌లో 9మంది మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న ఉత్తరాఖండ్ నైనిటాల్‌ జిల్లా రామ్‌నగర్‌ ప్రాంతంలోచోటు చేసుకుంది.శుక్రవారం తెల్లవారుజామున రామ్‌నగర్‌ వద్ద ధేలా నది వరద నీటి ప్రవాహంలో ఎర్టిగా కారు కొట్టుకుపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మరణించారు. ఓ బాలిక సహా ఇద్దరిని పోలీసులు రక్షించారు. ప్రమాద సమయంలో కారులో 11 మంది ఉన్నారని చెప్పారు. మృతులంతా పంజాబ్‌కు చెందిన వారేనని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement