Sunday, April 28, 2024

International | భారత్​లో మానవహక్కుల ఉల్లంఘన.. యూఎస్​లో ఉపన్యాసాలు ఇవ్వబోమన్న వైట్​హౌజ్​

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రధాని మోదీకి ఉపన్యాసాలు ఇవ్వరని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ప్రెసిడెంట్ బిడెన్, ప్రధాని మోదీ బుధవారం రాత్రి ప్రైవేట్ భేటీ ఉండనుంది. ఆ తర్వాత తదుపరి సమావేశాలు జరగనున్నాయి. కాగా, భారతదేశంలో ప్రజాస్వామ్య వెనుకబాటుతనం గురించి బిడెన్​ “మోదీకి ఉపన్యాసాలు ఇవ్వడు” అని వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ విలేకరులకు చెప్పినట్టు రాయిటర్స్ తెలిపింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

బిడెన్​, మోదీ సమావేశం తర్వాత ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం.. విక్రయాలు, కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, మైక్రోన్ టెక్నాలజీ.. ఇతర US సంస్థల ద్వారా భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించిన అనేక ఒప్పందాలను ప్రకటించనున్నారు. అయితే.. భారత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా అక్కడి డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రసంగించే ఉమ్మడి కాంగ్రెస్​ సమావేశానికి తాము హాజరుకాబోమని, బహిష్కరిస్తున్నట్టు ట్విట్టర్​లో తెలిపారు.

ఇక.. యుఎస్ పత్రికా ఎన్​ఎస్ఏ​లో పేర్కొన్న కొన్ని అంశాలు తీవ్రంగా చర్చకు దారితీస్తున్నాయి. మతపరమైన లేదా ఇతర స్వేచ్ఛలకు సవాళ్లుగా మారినప్పుడు తాము తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తామని, తాము వాటిపై ఉపన్యాసాలు ఇవ్వబోమని ఎన్​ఎస్​ఏ పత్రికలో కథనం వచ్చినట్టు తెలుస్తోంది. కాగా.. అంతిమంగా భారతదేశంలో రాజకీయాలు, ప్రజాస్వామ్య సంస్థల ఉనికి వంటి అంశాలపై తలెత్తే ప్రశ్నలు భారతదేశంలోని భారతీయలే నిర్ణయిస్తారని, ఇది యునైటెడ్ స్టేట్స్ లో నిర్ణయం తీసుకోబోమని వైట్​ హౌజ్​ జాతీయ భద్రతా సలాహాదారు సుల్లివన్ చెప్పారు.

- Advertisement -

కాగా, ప్రధాని మోదీతో మానవ హక్కులను తీసుకురావాలని డెమోక్రాట్లు బిడెన్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రధాని మోదీ సంయుక్త కాంగ్రెస్ ప్రసంగాన్ని బహిష్కరించాలని అమెరికా చట్టసభ సభ్యులు ఇల్హాన్ ఒమర్, రషీదా త్లైబ్ నిర్ణయించారు. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించిన వారు ఈ నిర్ణయం వెనుక మోదీ కారణమని పేర్కొన్నారు.

ఒక ట్వీట్‌లో త్లైబ్ ఇలా రాసుకొచ్చారు. ‘మోదీకి మన దేశ రాజధానిలో వేదిక ఇవ్వడం సిగ్గుచే.టు- మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు, ముస్లింలు & మతపరమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకోవడం.. జర్నలిస్టులను సెన్సార్ చేయడం వంటి సుదీర్ఘ చరిత్ర ఆమోదయోగ్యం కాదు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడే మోదీ ఉమ్మడి ప్రసంగాన్ని బహిష్కరిస్తాను .. అని ఆమె ట్వీట్​లో తెలిపారు.

ఈ రోజు ఇల్హాన్ ఒమర్ ట్వీట్ చేస్తూ.. “ప్రధాని మోదీ ప్రభుత్వం మతపరమైన మైనారిటీలను అణచివేసి, హింసాత్మక హిందూ జాతీయవాద సమూహాలను ప్రోత్సహించింది. జర్నలిస్టులు, మానవ హక్కుల న్యాయవాదులను శిక్షార్హులు లేకుండా లక్ష్యంగా చేసుకుంది. నేను మోదీ ప్రసంగానికి హాజరుకాను. మోదీ అణచివేత, హింసాకాండపై చర్చించేందుకు మానవ హక్కుల సంఘాలతో నేను బ్రీఫింగ్ నిర్వహిస్తాను.. అని ఆమె ట్వీట్​లో వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement